Tuesday, May 21, 2024

సంపార్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌పై సర్కార్ దృష్టి….

- Advertisement -
- Advertisement -

మత ప్రార్థనల్లో పాల్గొన్న ఎక్కువ మంది ప్రయాణించింది ఈ ట్రైనే
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 300 పాజిటివ్ కేసులు
తబ్లీగిలతో కలసి బోగిలో ప్రయాణించిన వ్యక్తులకు కరోనా
అప్రమత్తమైన వైద్య, పోలీస్, ఇంటలిజన్స్ యంత్రాంగం

Sampark kranti express

మన తెలంగాణ /హైదరాబాద్: సంపార్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌పై సర్కార్ దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా అందోళన సృష్టిస్తున్న తబ్లీగి ప్రతినిధులు ఇదే ట్రైన్‌లో ఎక్కువ మంది ప్రయాణించినట్లు సమాచారం. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో మర్కజ్ లింక్ ద్వారా సుమారు 300 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య , పోలీస్, ఇంటలిజన్స్ యంత్రాంగం పూర్తిగా అలెర్ట్ అయ్యింది. ముఖ్యంగా తెలంగాణలో 24 గంటల పాటు పనిచేస్తూ అధికారులు బాధితులను గుర్తిస్తున్నారు. మరోవైపు అన్ని జిల్లా అధికారులకు కూడా అదేశాలు జారీ అయ్యాయి. సంపార్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ట్రైన్లలో ఢిల్లీ వెళ్లోచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలించి కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రజారోగ్య, కుటంబ సంక్షేమ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

అదే బోగిలో ప్రయాణించిన ఖమ్మం వాసికి, నల్గొండ వాసులకూ కరోనా…..

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న తబ్లీగిల ట్రైన్‌బోగిలో ఖమ్మం జిల్లాకి చెందిన వ్యక్తి ప్రయాణించాడు. దీంతో అతనికి కూడా కరోనా సోకినట్లు సోమవారం రాత్రి ఆ జిల్లా డిఎమ్‌హెచ్‌ఒ డా మాలతి ప్రకటించారు. దీంతో జిల్లా మొత్తం హై అలర్ట్‌లో ఉంది. ఇప్పటికే ఈ వ్యక్తిని ప్రత్యక్షంగా కలసిన 45 మందిని క్వారంటైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 14వ తేదిన ఢిల్లీ వెళ్లిన ఖమ్మం వాసి అక్కడ వివిధ ప్రదేశాల్లో తిరిగి 18వ తేది తిరిగి రాష్ట్రానికి చేరుకున్నాడు. అయితే తిరుగు ప్రయాణంలో మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి బోగిలో కూర్చున్నాడు. అనంతరం ఖాజీపెటలో దిగి అతను మరో ట్రైన్ ద్వారా ఖాజీపేట చేరుకున్నాడు. అనంతరం రెండు రోజుల పాటు ఖమ్మంలో వివిధ పనులు ముగించుకొని తిరిగి ఆయన సొంత గ్రామం పెద్డతండాకి వెళ్లాడు. అయితే ఢిల్లీ ప్రయాణికులను గుర్తించే క్రమంలో వైద్యాధికారులు గ్రామాల్లో ఆరా తీయగా, ఈ వ్యక్తి పేరు బయటకు వచ్చింది. దీంతో రెండు మూడు రోజుల పాటు క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఈ వ్యక్తి తిరిగి ప్రదేశాలన్నీ అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. అంతేగాక ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఆందోళన నెలకొంది. దీంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లోచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఆరుగురికి కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆ వ్యక్తి కూడా తబ్లీగిలు ప్రయాణించిన ట్రైన్‌లో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ట్రైన్ ప్రయాణాలు హాట్ టాపిక్‌గా మారాయి.

జిల్లాల్లో వేగంగా ట్రెసింగ్…….

రాష్ట్రంలో మర్కజ్ మత ప్రార్థనలు ఆందోళన రేకేత్తిస్తున్నాయి. ఇప్పటికే 25 జిల్లాల్లో కరోనా క్రమంగా సోకింది. ఆయా జిల్లాలతో పాటు మిగతా జిల్లాల వాళ్లు కూడా పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా మర్కజ్‌లింక్ ద్వారా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వారు ప్రయాణించిన ట్రైన్లను అధికారులు వేగంగా గుర్తిస్తున్నారు. తాజాగా మత ప్రార్ధనల వ్యక్తుల బోగిలో ప్రయాణించిన వ్యక్తికీ కరోనా సోకడంతో గత నెలలో ఢిల్లీ వెళ్లోచ్చిన వారందరికీ భయాందోళనలు నెలకొన్నాయి. అనుమానిత లక్షణాలు కలిగిన వారు కొన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగా క్వారంటైన్‌కి వస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రతి ఇంటిని పరిశీలిస్తున్నామని, ఎలాంటి అనుమానిత లక్షణాలు ఉన్నా, వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎవరు భయాందోళన చెందవద్దని, కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ను పాటిస్తూ, అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్ కావాలని అధికారులు సూచిస్తున్నారు.

Police concerntrate on Sampark kranti express
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News