Sunday, April 28, 2024

పేదరికం, ఇన్‌ఫ్లమేషన్‌తో క్యాన్సర్‌లో మూడింతల మరణ ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా వర్శిటీ పరిశోధకుల అధ్యయనం

న్యూఢిల్లీ : పేదరికం, దీర్ఘకాలిక అంతర్గత వాపు ( ఇన్‌ఫ్లమేషన్ )కలిసి 15 ఏళ్లలో గుండె వ్యాధుల్లో రెట్టింపు , క్యాన్సర్ వ్యాధిలో మూడింతలు మరణ ప్రమాదాన్ని పెంచుతాయని అమెరికా లోని కొత్త అధ్యయనం కనుగొన గలిగింది. ఫ్లోరిడా యూనివర్శిటీ పరిశోధకులు పేదరికం, ఇన్‌ఫమేషన్ కలిసి ఏ విధంగా ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తాయో, జీవిత కాలాన్ని ఎలా తగ్గిస్తాయో మొట్టమొదటి సారి కనుగొన గలిగారు.

ఇన్‌ఫ్లమేషన్ లేదా పేదరికం ఏదోఒక దానివల్ల మరణ ప్రమాదం 50 శాతం కన్నా ఎక్కువగా ఉండగా, దీనికి భిన్నంగా పేదరికం, ఇన్‌ఫ్లమేషన్ కలిసి ప్రభావం చూపిస్తే గుండె వ్యాధుల్లో 127 శాతం, క్యాన్సర్ వ్యాధుల్లో 196 శాతం మృతి చెందే ముప్పు ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఫ్రాంక్ ఎ. ఒర్లాండో విశ్లేషించారు. ఈ అధ్యయనం జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్‌లో వెల్లడైంది. పేదరికం, అంతర్గత వాపు ఈ రెండూ పరస్పరం సంకలితమైతే మరణ ప్రమాదం 100 శాతం వరకు ఉంటుందని ఒరియాండో వెల్లడించారు.

1999 నుంచి 2002 వరకు నిర్వహించిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్‌టెన్షన్ సర్వేలో 40 ఏళ్లకు మించిన వారి డేటాను ఈ అధ్యయనం లో తీసుకున్నారు. 2019 వరకు వీరిని పర్యవేక్షించారు. ఈడేటాతో నేషనల్ డెత్ ఇండెక్స్ రికార్డులను పోల్చి దాదాపు 15 ఏళ్లలో వారి మరణ ప్రమాద శాతాన్ని అంచనా వేశారు. సామాజిక ప్రతికూలత కలిగిన ముఖ్యంగా వైద్యపరంగా దుర్బలమైన వారి దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ స్క్రీనింగ్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవలసిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో సూచించారు. దీనివల్ల నివారించవలసిన మరణాలను తగ్గించవచ్చని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News