Friday, April 26, 2024

వాన పడితే విద్యుత్ సరఫరా కట్

- Advertisement -
- Advertisement -

Power outage if it rains in hyderabad

మరమత్తుల్లో గంటల కొలది జాప్యం
అసహనానికి గురవుతున్న వినియోగదారులు

హైదరాబాద్: నిరంతర విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని గొప్పలకు చెప్పుకుంటున్న అధికారులు నగరంలో వర్షాలు పడుతున్న సమయంలో జరుగుతున్న పవర్ కట్‌లను నిరోధించ లేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చిన్న వాన పడిందంటే మహానగరంలో చీకుట్ల అలుముకుంటున్నాయి. చిన్న పాటి వర్షం వచ్చినా, గట్టిగా గాలి దుమారం వచ్చినా, విద్యుత్ వినియోగం పెరిగినా, ఒత్తిడి పెరిగినా విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోంది. చిన్న పాటి వర్షం పడినా, ఎండ తీవ్రత పెరిగినా నిత్యం ఏదో ఒక చోట ట్రాన్స్‌ఫార్మర్లు విఫలమై విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.గాలి దుమారం వచ్చినాలుగు చినుకులు పడక ముందే విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి. చిన్న పాటి వర్షం వచ్చినా విద్యుత్ ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి.

మహానగరంలో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల వెచ్చించి మరమ్మత్తులు చేపట్టినా నిత్యం అదే పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా నగరంలో చిన్నపాటి వర్షానికే కరెంట్ పోవడంతో రాత్రి సమయంలో వర్షం పడుతుందంటనే రాత్రంతా చిమ్మచీకటిల్లో మగ్గాల్సి వస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో రాత్రి సమయంలో వర్షం పడ్డదంటే ఏ ఉపద్రవం జరగబోతోందన్న ఆందోళన మొదలువుతుదంటే అతిశయోక్తి కాదు. గతంలో హైటెన్షన్ వైర్లు తెగిపడి విద్యుత్‌ఘాతానికి లోనై మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం ఉన్నా టీఎస్ ఎస్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులు నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. హైటెన్షన్ వైర్లు తొలగించి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేపట్టాలని ప్రారంభించిన కేబులింగ్ పనులు ఏళ్ళ తరబడి నత్తనడకన సాగుతున్నాయి. అవి ఎప్పటికి పూర్త అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలోని కొన్ని బస్తీల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. తీగలు వేలాడటం, మరి కొన్ని చోట్ల చెట్లలోంచి విద్యుత్ తీగలు వెళ్ళడం అదే విధంగా కనీసం కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదరకంగా మారుతున్నాయి.

విద్యుత్ పునరుద్దరణలో జాప్యం

గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. విద్యుత్ పురుద్దరణకు గంటల కొలది సమయం పడుతుడుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇళ్ళల్లో ప్యాన్లు తిరగక పోవడంతో దోమలు విజృంభించి వినియోగదారుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు ఆయా ఇళ్ళల్లో ఉండలేక కొంత మంది తమ ఇళ్ళకు తాళాలు వేసి బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో తలదాచుకోవాల్సిన పరిస్ధితులు ఏర్పాడుతున్నాయి. వినియోగదారులు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ఫోన్లు చేస్తే వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసిఉండటంతో అసహనానికి గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే రోజంతా బిజీగా ఉన్నట్లు సమాధానం వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News