Monday, April 29, 2024

డబుల్ ఇంజిన్లకు కరెంట్ కట్‌కట

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో 24 గంటల కరెంట్ : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెస్, వారి మిత్రపక్షాల రాష్ట్రాలు విద్యుత్ కొరతతో అల్లాడుతున్నాయని, దేశంలో వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ‘ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం, తెలంగాణకు సిఫార్సు చేసిన నిష్పత్తిలో అక్కడి ప్రదేశాలలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్ సరఫరాను ఆంధ్రప్రదేశ్ తిరస్కరించడం వల్ల రాష్ట్రం ఏర్పడే సమయంలో విద్యుత్ సమస్య జటిలమైంది. తొలి రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 12 గంటలకు పైగా విద్యుత్తు కోతల ప్రమాదకర విద్యుత్ సరఫరా (లభ్యత) స్థితిని అధిగమించడం ద్వారా, పారిశ్రామిక రంగానికి ప్రతి వారం 3 నుండి 4 పవర్ హాలిడేలు, వ్యవసాయ రంగానికి 6 గంటల సరఫరాను అందించడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. దీంతో, అన్ని వర్గాల వినియోగదారులకు 24×7 సరఫరాను నిర్ధారించిన దేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నేడు ఆ ఘనతను సాధించిందన్నారు.

ఈ క్రమంలో 2×600 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల యూనిట్, 4×30 మెగావాట్ల పులిచింతల హైడ్రో-ఎలక్ట్రిక్ స్టేషన్, 4×270 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 5×800 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లను త్వరగా ప్రారంభించే దిశగా ప్రభుత్వం స్పీడప్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన కేసులతో ఆలస్యమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటిపిఎస్) మినహాయించి, ప్రాజెక్ట్ పురోగతి, ఇతర సౌకర్యాల ఆధారంగా రెండు ఫైనాన్స్ ఏజెన్సీలు -పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ – నిధులను విడుదల చేయకుండా కేంద్రం అడ్డంకులు సృష్టించినప్పటికీ.. అన్ని ఇతర సౌకర్యాలు విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రానికి సహాయం చేశాయని తెలిపారు. ఉమ్మడి ఎపి విభజనకు నెలరోజుల ముందు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సరఫరా, పంపిణీ లైన్లు ఏర్పడితే బట్టలు ఆరబెట్టేందుకు మాత్రమే ఉపయోగపడతాయని రికార్డుల్లోకి ఎక్కారని ఎద్దేవా చేశారు. ‘ప్రత్యేక రాష్ట్రం కాబట్టి వాటి గుండా విద్యుత్ ప్రవహించదు. దీంతో విద్యుత్ సమస్యను అధిగమించడంలో తెలంగాణ సత్తాను నిరూపించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. అన్ని అడ్డంకులను దాటుకుంటూ జనవరి 1, 2018 నుండి దేశంలో వ్యవసాయ రంగానికి 24X7 ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింద’ని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
ఎనిమదేండ్లలో వినియోగిస్తున్న విద్యుత్ వినియోగం మిలియన్ యూనిట్లలో…
సంవత్సరం            వ్యవసాయ రంగం         మొత్తం
2014-15                   11,671       39,183
2015-16                   11,190       40,650
2016-17                   14,374       43,729
2017-18                   18.241       50.526
2018-19                   20,696       57,591
2019-20                   17.959       58.522
2020-21                   18,946       56,111
2021-22                   19,144       61,349
2022-23                   19,937       66,661

మరోవైపు… డబుల్ ఇంజిన్ రాష్ట్రాలుగా చెప్పుకునే బిజెపి పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో అస్తవ్యవస్త పాలనను కొనసాగిస్తున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అదే 2013–14లో విద్యుత్ లోటు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించడమే కాకుండా, దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ సోమవారం ట్వీట్ చేశారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటేనని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో చెప్పారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, వినియోగం మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించిన వివరాల జాబితాను పోస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News