Monday, May 6, 2024

ప్రధాన మంత్రి జన్ ధన్ లూట్ యోజన: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

న్యూఢిల్లీ: పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్ సోమవారం కేంద్రంపై ధ్వజమెత్తింది. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దీనిని ‘ ప్రధాన మంత్రి జనధన్ లూట్ యోజన’ అని దుయ్యబట్టారు. బైక్, కారు, ట్రాక్టర్ ఫుల్ ట్యాంక్ నింపిస్తే 2014తో పోలిస్తే నేడు ఎంత ఖర్చయిపోతుందన్నది ఆయన చిత్రాల ద్వారా ట్విట్టర్ లో తెలిపారు. ఇదిలావుండగా మోడీ పాలనలో ప్రతి ఉదయం వేధనే తీసుకొస్తుందే తప్ప ఆనందం కాదని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ‘ఈ రోజు ఉదయం కూడా ఇంధనం లూటీ లీటరు పెట్రోల్, డీజిల్ రూ. 0.40 పెరిగింది’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. సిఎన్ జి కిలో రూ. 2.50 మేరకు పెరిగింది. ఇక రెండు వారాల్లో  లీటరు పెట్రోల్/డీజిల్ ధర రూ. 8.40 చొప్పున పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ‘బిజెపికి ఓటేయ్యడం అంటే ద్రవ్యోల్బణానికి ఓటేయ్యడమే’ అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ. 103.41 నుంచి రూ. 103.81కి పెరిగింది. కాగా డీజిల్ లీటరుకు రూ. 94.67 నుంచి రూ. 95.07కు పెరిగింది. నాలుగున్నర నెలల్లో ఇలా ఇంధన ధరలు పెరుగడం 12వ సారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News