Friday, May 3, 2024

చంద్రయాన్ 3.. విరామ దశ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : జాబిల్లిపై ప్రస్తుతానికి చంద్రయాన్ 3 పక్షం రోజుల విరామ విశ్రమ దశకు చేరుకుంది. చంద్రుడి ఉపరితలంపై పక్షం రోజుల పగటిరోజులు దాటి ఇప్పుడు చీకటి రోజుల అవస్థ ఆరంభమైంది. దీనితో ఒక్కరోజు ముందు ప్రజ్ఞాన్ రోవర్ ఆదివారం సెంచరీ కదలిక తరువాత పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుంది. కాగా సోమవారం విక్రమ్ ల్యాండర్ కూడా ఇదే దశకు చేరింది. చంద్రుడిపై అత్యంత కీలకమైన ప్రయోగాలు నిర్వహించే, డేటాను , ఫోటోలను పంపించే టూల్స్ ల్యాండర్, రోవర్‌లు ఇప్పుడు స్లీప్ దశకు చేరాయని ఇస్రో ప్రకటించింది. స్లీప్ మోడ్‌కు ముందు తుదిరోజు సోమవారం నాడు విక్రమ్ ల్యాండర్ శక్తిని పరీక్షించారు. ఛాస్టే, రాంభా ఎల్‌పి, ఐఎల్‌ఎస్‌ఎ పేలోడ్స్ ద్వారా జరిపిన హాప్‌టెస్టులలో ల్యాండర్ నెగ్గింది. చివరి రోజున ఇది సరిగ్గా పనిచేసింది. భూ కేంద్రం సంకేతాలకు అనుగుణంగా చంద్రుడి ఉపరితలంపై తిరిగి ల్యాండ్ అయింది.

ఇంతకు ముందటి చోట కాకుండా వేరే చోట ఇప్పుడు ల్యాండర్ వాలింది, దీని పేలోడ్స్ స్విచాఫ్ చేశారు. రిసీవర్స్‌ను ఆన్‌లోనే ఉంచారని , ల్యాండర్‌లోని బ్యాటరీ పూర్తిగా క్షీణించగానే విక్రమ్‌లాగానే ఇది కూడా స్లీప్ దశకు చేరుకుంటుందని ఇస్రోవర్గాలు తెలిపాయి. రోవర్‌కు సమీపంలోనే ఇది విశ్రమిస్తుంది. చంద్రుడిపై నెలకొన్న సహజసిద్ధ చీకటిరాత్రిని తట్టుకుని ఉంటూ తిరిగి పగటి దశ ఏర్పడ్డాక పనిచేసేందుకు వీలుగా ల్యాండర్, రోవర్‌లకు నిద్రావస్థ అవసరం అని ప్రయోగాల దశలోనే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ విధంగా ఈ నెల 23 నాటికి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తిరిగి బ్యాటరీ ఇంధన శక్తితో పునరుజ్జీవమై , తిరిగి మేల్కొంటాయని, దీనితో చంద్రయాన్ ప్రయోగాలు తిరిగి ఆరంభమవుతాయని ఆశిస్తున్నారు. ల్యాండర్‌కు చివరి రోజున జరిపిన పరీక్షలు అత్యంత కీలకమైనవి అని,

వీటికి సందేశాలు ఇచ్చి తిరిగి పనిచేయించే కిక్ స్టార్ట్ పద్ధతి భవిష్యత్తులో ఏ ఇతర అంతరిక్ష ప్రయోగాలలో అయినా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఇస్రో తెలిపింది. ఇస్రో కేంద్రం నుంచి జరిపిన హాప్ టెస్టుల్లో భాగంగా ల్యాండర్ 40 సెంమీల ఎత్తుకు చేరుకుని, అక్కడి నుంచి 30 40 సెంటిమీటర్ల దూరంలో సేఫ్ ల్యాండ్ అయిందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్‌లోని పేలోడ్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నాయని, తిరిగి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయనే విషయాన్ని ఇప్పటి పరీక్షలలో ల్యాండర్ ద్వారా నిర్థారించుకున్నట్లు ఇస్రో తెలిపింది.

పక్షం రోజులకు పనిచేస్తే చరిత్రనే లేకపోతే చరిత్రలోనే
నిజానికి చంద్రయాన్ 3 అంతర్భాగపు ఆ మాటకొస్తే కవల పిల్లల వంటి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లకు చంద్రుడిపై కాలపరిమితి కేవలం 14 రోజులే, చంద్రుడిపై పగటి కాంతుల పక్షంరోజుల దశలోనే ఇవి చేయగల్గిన పరీక్షలు చేయగల్గుతాయి. చీకటి రోజులు రాగానే ఇవి పని నిలిపివేయాల్సి ఉంటుంది. బ్యాటరీలు ఆగిపోతాయి. తరువాత తిరిగి సూర్యకిరణాలు చంద్రుడిపై ప్రసరించినప్పుడు వీటిని తగు విధంగా గ్రహించేందుకు వీలుగా రోవర్ రిసీవర్‌ను అమర్చారు. ల్యాండర్‌లోని అత్యంత కీలకమైన పేలోడ్స్‌ను భద్రపర్చినట్లుగా ఉంచారు. సూర్యకాంతితో తిరిగి ల్యాండర్ , రోవర్‌లు తిరిగి పనిచేసే చంద్రుడిపై పరిశోధనల క్రమంలో మరో చరిత్రనే అవుతుంది. తిరిగి ఇవి పగటి కాంతిలోనూ ఛార్జీంగ్ అయ్యి పనిచేయలేకపోతే ఇవి రెండూ భారతదేశం తరఫున చంద్రుడిపైనే నిలిచి ఉండే జ్ఞాపికలు లేదా ఏమి చేయలేని దూతలుగా నిలుస్తాయి. చరిత్రలో నిలుస్తాయని ఇస్రో వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News