Tuesday, May 7, 2024

ప్రసిద్ధ్‌ను టెస్టుల్లో ఆడించాలి

- Advertisement -
- Advertisement -

Prasidh krishna should be taken into Tests

 

పుణె: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను టెస్టు జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇక కెరీర్‌లో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడన్నాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపిఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసే ప్రసిద్ధ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందన్నాడు. రానున్న రోజుల్లో అతను మూడు ఫార్మాట్‌లలోనూ కీలక పాత్ర పోషించడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ రాణించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడని ప్రశంసించాడు. రానున్న మ్యాచ్‌లో ప్రసిద్ధ్ టీమిండియాకు చాలా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News