Sunday, April 28, 2024

మృత్యువును జయించిన ‘మానస’

- Advertisement -
- Advertisement -

Pregnant Woman recovering from most difficult conditions

 

అతి క్లిష్టమైన పరిస్థితుల నుంచి కోలుకున్న గర్భిణి
మెరుగైన వైద్యం అందించిన నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : అతి క్రిటికల్ కండీషన్‌లో ఉన్న నిండు గర్భిణికి నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. సుమారు 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె పూర్తిస్థాయిలో కోలుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఈ కేసుకు సంబంధించి వైద్యులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నిజామాబాద్‌కు చెందిన మదన్‌కుమార్ సతీమణి మానస నిండుగర్బిణీ. గత నెల 21వ తేదిన డెలివరీ కోసం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. మత్తు మందు ఇచ్చిన తర్వాత సిజేరియన్ చేసే సమయంలో పుట్టే బాబు అవయవాలు అకస్మత్తుగా బయటకు వచ్చేశాయి. దీంతో ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఈక్రమంలో అక్కడి డాక్టర్ల సూచన మేరకు సదరు బాధితులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని తేల్చి చెప్పారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ చేస్తే తల్లి, బిడ్డకు ప్రమాదం పొంచి ఉందని, నార్మల్ డెలివరీ చేయాలని నిలోఫర్ వైద్యులు చెప్పడంతో ఈ గర్భిణి కుమిలిపోయింది. ఈక్రమంలో ఆమె సృహా తప్పి పడిపోవడంతో తప్పని పరిస్థితుల్లో మానసకు సిజరింగ్ చేసి బాబును బయటకు తీశారు. కానీ రోజురోజుకి మానస ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. దీంతో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నిలోఫర్ వైద్యులతో మాట్లాడారు. అయినా ఫలితం లేదు. కానీ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సిఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌సి శేరి శుభాష్‌రెడ్డి వెంటనే స్పందించారు. సిఎం కార్యాలయ ఓ ఎస్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సదరు పేషెంట్‌ను ఫిబ్రవరి 28వ తేదిన ఉస్మానియాకు తరలించారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన వైద్యాశాఖ ఉన్నతాధికారులు నిమ్స్‌కు తరలించాలని సూచించారు.

దీంతో నిమ్స్‌లో సుమారు 10 రోజుల పాటు ఆమె వెంటిలేటర్‌పై చికిత్సను పొంది సురక్షితంగా కోలుకుంది. గురువారం రాత్రి నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. పాల కోసం ఎదురుచూస్తున్న మానస పుత్రుడు చివరికి తల్లిఒడికి చేరాడు. నిమ్స్ డాక్టర్లు వరుణ్, ముకుంద, రూపం, రుక్ష్మిణిల బృందం ఆ పేషెంట్‌కు కాపాడేందుకు ఎంతో శ్రమించారు. ఈ సందర్బంగా డాక్టర్లు మాట్లాడుతూ…మానస గర్భ సమయంలో ఏర్పడిన ఒక వ్యాధి వల్ల ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆసుపత్రిలో కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వలన ప్రస్తుతం ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. ప్రస్తుతానికి ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, కానీ కొంతకాలం తాము సూచించిన మందులు, ఫిజియోథెరఫీ చేయాలన్నారు. రెండు వారాల తర్వాత ఆమెను మరోసారి చెక్ చేస్తామని డా ముకుంద అన్నారు. అయితే తన భార్యను మృత్యువు నుంచి కాపాడిన డాక్టర్లతో పాటు ఎంతో సహాయం చేసిన ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి, మహిళా కమీషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, మంత్రి ఈటల రాజేందర్లకు మానస భర్త మదన్‌కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News