Friday, May 3, 2024

అతి సామాన్య కుర్రాడిని రాష్ట్రపతిని అవుతాననుకోలేదు

- Advertisement -
- Advertisement -

అతి సామాన్య కుర్రాడిని రాష్ట్రపతిని అవుతాననుకోలేదు
స్వగ్రామంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ భావోద్వేగం
మాతృభూమికి రాష్ట్రపతి వందనం
లఖ్‌నవూ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రామ్‌నాధ్ కోవింద్ తొలిసారిగా స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా ఫరుంఖ్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగిన వెంటనే కాస్త ఉద్వేగానికి గురయ్యారు. గ్రామం లోకి అడుగు పెట్టగానే నేలతల్లికి వంగి నమస్కరించారు. మట్టిని చేత్తో తీసుకుని నుదుటిపై రాసుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతికి ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్, గవర్నర్ ఆనంద్‌బెన్ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో తన చిన్ననాటి స్నేహితులను, సహ విద్యార్ధులను కలుసుకుని గతస్మృతులు నెమరు వేసుకున్నారు. గ్రామంలో పలువురిని పేరుపేరున పిలిచి తన అనుబంధాన్ని పంచుకున్నారు. గ్రామంలోని పత్రిమాతా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామానికి చెందిన తన లాంటి ఒక సామాన్య కుర్రాడు ఇంత పెద్ద దేశానికి చెందిన అత్యున్నత బాధ్యతలను నిర్వర్తించే అధికారాన్ని పొందుతానని తానేనాడూ ఊహించలేదని అన్నారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ దీన్ని నిరూపించి చూపించిందని భావోద్వేగంగా అన్నారు.

‘నేను ఎక్కడున్నా నా మాతృభూమి మట్టి వాసనలు నావెంటే ఉంటాయి. మీరంతా ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోతారు. పరుంఖ్ కేవలం ఓ గ్రామం కాదు. నాకెన్నో విషయాలను నేర్పించి, దేశానికి సేవ చేయగలిగే స్థితికి నా మాతృభూమి తీసుకెళ్లిందని ఈ మాతృభూమి ప్రేరణే తనను హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు, సుప్రీం కోర్టు నుంచి రాజ్యసభకు, అక్కడ నుంచి రాజ్‌భవన్‌కు, తద్వారా రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లిందని రాష్ట్రపతి ఉద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాధ్ కోవింద్ తొలిసారిగా రైలు ప్రయాణం చేశారు. ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో రాష్ట్రపతి భార్య సవితా దేవితో కలసి ప్రత్యేక రైలులో కాన్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పరుంఖ్ గ్రామం వెళ్లారు. రెండు రోజులు అక్కడ పర్యటించి జూన్ 28న కాన్పూర్ నుంచి లఖ్‌నవూ చేరుకుంటారు. అక్కడ మరో రెండు రోజులు పర్యటించి జూన్ 29 సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు.

President Ram Nath Kovind tribute to land of his birth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News