Saturday, May 4, 2024

నిర్భయ దోషి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించారు. ఇప్పటికే నిర్భయ దోషులు వినయ్, ముఖేష్, అక్షయ్ లు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. మార్చి 3న నలుగురు దోషులను తీహార్ జైలులో ఉరి తీయనుండగా.. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నందున ఉరిని నిలిపివేయాలని దోషి పవన్ గుప్తా కోరుతూ ఢిల్లీ కోర్టులో క్యూరేటీవ్ పిటిషన్ వేశాడు. దీంతో మార్చి 2న దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు ఉరిపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నలుగురు దోషుల ఉరిని నిలిపివేయాలని తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో నిర్భయ దోషుల ఉరి మూడోసారి వాయిదా పడింది.

President Rejects Mercy Plea of Convict Pawan Gupta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News