Saturday, May 4, 2024

ఆ బంధం కోసం చిన్ననాటి స్నేహితుడి గొంతు కోసి… పిఎస్‌లో లొంగిపోయింది

- Advertisement -
- Advertisement -

Murder

 

పుణే: వివాహ బంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్ననాటి చెలికాడిని ఓ మహిళ హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణే ప్రాంతం సిన్హాగాడ్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2016 నుంచి ఓ మహిళ (25) చిన్న నాటి స్నేహితుడితో (28) వివాహేతర సంబంధం పెట్టుకుంది. నర్హే ప్రాంతంలో ఆమె కోసం ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకొని పలుమార్లు ఆమెను అతడు కలుస్తుండడంతో ఆమె వివాహ బంధానికి ఇబ్బందులు ఏర్పడుతాయని హెచ్చరించింది. అదేమీ పట్టించుకోకుండా ప్రియుడు ఆమెను పలుమార్లు కలుస్తూనే ఉన్నాడు. ప్రియుడిని చంపితే తాను వివాహ బంధంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆలోచించింది. ప్రియుడు ఉన్న ప్లాట్‌కు వెళ్లి మంగళవారం రాత్రి ఆమె  అక్కడే బస చేసింది. ప్రియుడు గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత సిజేరియన్ కత్తితో అతడి గొంతును కోసింది. అతడు చనిపోయిడని నిర్దారించుకున్న తరువాత ఆమె ఉరేసుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఆమె అప్పటికే గర్భవతి కావడంతో ఆత్మహత్య చేసుకోవద్దని నిర్ణయం తీసుకుంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన చిన్న నాటి ప్రియుడిని హత్య చేశానని పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News