Tuesday, May 7, 2024

క్లాస్‌మేట్‌పై వైద్యుడు అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

Rape

బెంగళూరు: క్లాస్‌మేట్‌పై 25 ఏళ్ల వైద్యుడు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలోని గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్యాన్‌లో గురుగ్రామ్‌కు చెందిన దీపక్ రాథీ అనే వైద్యుడు బెంగళూరులో మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకునేవారు. ఫిబ్రవరి 16న జయనగర్‌లో హోటల్‌కు రమ్మని అతడు ఆమెకు కబురు పంపాడు. హోటల్‌కు వెళ్లిన తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రస్తుతం ఆమెతో మాట్లాడకుండా వేధించసాగాడు. ఫిబ్రవరి 23న కాలేజీ ఆవరణంలో ఆమె వెంటపడ్డాడు. ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు అసభ్యకరమైన చిత్రాలు తీసి వేధించసాగాడు. ఔట్ పెషంట్ విభాగంలో రోగులకు ఆమె చికిత్స చేస్తున్నప్పుడు… ఆమె ఫోన్‌ను దొంగలించి అందులో ఉన్న కొన్ని ఫోటోలను తీసేశాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మరోకరితో చనువుగా ఉంటున్నావని అసభ్యకరంగా మాట్లాడారు. వైద్యుడితో ఆమె చనువుగా ఉన్న అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని వేధించడంతో తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 26న హోటల్ బుక్ చేసిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు నిందితుడిపై ఐపిసి 376, ఐపిసి 354 , ఐపిసి 354సి, ఐపిసి323, ఐపిసి 417, ఐపిసి 506, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

Doctor rape on College mate in Karnataka

 

Doctor rape on College mate in Karnataka
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News