Thursday, May 9, 2024

మోడీని ట్వీట్ ద్వారా నిలదీసిన ప్రియాంక గాంధీ

- Advertisement -
Priyanka Gandhi tweets

- Advertisement -

లఖింపూర్ ఖేరి ఘటన వీడియో ట్వీట్

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో నిరసన తెలుపుతున్న రైతులపై జీపును నడిపిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ లక్నోను సందర్శించనున్న నేపథ్యంలో ఆమె ఈ వీడియోను ట్వీట్ చేశారు.
సోమవారం అరెస్టయిన ఆమె ప్రధానికి ప్రశ్నలు సంధించారు. “మీరు వీడియోను చూశారా? (లఖింపూర్‌లో రైతులపై జీపును నడిపిన వీడియోను ఆమె మొబైల్‌లో పట్టుకుని చూయించారు). ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు? లఖింపూర్ సందర్శించాలనుకుంటున్న మా వంటి నాయకులను మాత్రం ఎఫ్‌ఐఆర్ లేకుండానే కస్టడీలో ఉంచుతున్నారు. యాక్సిడెంట్ చేసిన ఆ మనిషి ఇంకా ఎందుకు స్వేచ్ఛగా ఉన్నాడో నేను తెలుసుకోదలచుకున్నాను” అని ఆమె ప్రధానిని సూటిగా ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేనిని ఇంకా ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించలేదని కూడా ఆమె ప్రశ్నించారు. తేని కుమారుడు ఆశిష్ కాన్వాయ్ ఆదివారం లఖింపూర్‌లోని తికోనియాలో రైతులపై దూసుకుపోయిందని రైతులు చెబుతున్నారు.
“ఈ రోజున మీరు ఆజాదీ కా మహోత్సవ్ వేడుక వేదిక మీద మీరు కూర్చునేప్పుడు.. మోడీజీ, మన స్వాతంత్య్రం రైతుల కారణంగానే లభించిందని గుర్తుంచుకోండి. నేటికీ ఆ రైతు బిడ్డలే(సైనికులుగా) మన సరిహద్దులను పరిరక్షిస్తున్నారు. కొన్ని నెలలుగా మన రైతులను బాధపెడుతున్నారు. వారి గళాన్ని కూడా మీరు వినిపించుకోవడంలేదు” అన్నారు. ఇంకా ఆమె ఘటనాస్థలిని ప్రధాని సందర్శించాలని కూడా కోరారు.
పోలీసులు సోమవారం మిశ్రా కుమారుడు ఆశిష్‌పైన ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేశారు. చనిపోయిన రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 45లక్షలు ప్రకటించింది. ఓ సీనియర్ జడ్జీ నేతృత్వంలో న్యాయసంఘం ఘటనపై విచారణ జరపనుంది. అయితే ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News