Sunday, May 5, 2024

సీతాపూర్‌లో అరెస్టుకు నిరసనగా ప్రియాంక నిరాహార దీక్ష

- Advertisement -
- Advertisement -

Priyanka goes on Hunger strike to protest her arrest in Sitapur

 

సీతాపూర్ (యుపి) : ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో అక్రమంగా తనను అరెస్టు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం నిరాహార దీక్షచేపట్టారు. సీతాపూర్ జిల్లా లోని పిఎసి (ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబ్యులరీ) గెస్ట్‌హౌస్ వద్ద ధర్నా ప్రారంభించారు. లఖింపూర్ ఖేరి హింసాత్మక సంఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక వెళ్తుండగా సీతాపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రియాంక ధర్నాకు మద్దతుగా గెస్ట్‌హౌస్ బయట కాంగ్రెస్ నాయకులు ప్రియాంక అరెస్టుకు నిరననగా ఆ రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఖిలేష్ సింగ్ తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పిఎసి కేంపస్ బయట రోడ్డును చీపురుతో తుడిచారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన గెస్ట్‌హౌస్‌లో చీపురు పట్టుకుని గదిని తుడుస్తున్నట్టు కనిపించే 42 సెకండ్ల వీడియోను యుపి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వికాస్ శ్రీవాత్సవ విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News