Saturday, April 27, 2024

మారుతితో కలిసి కొత్త బ్యానర్

- Advertisement -
- Advertisement -

‘ఈ రోజుల్లో..’ వంటి హిట్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ‘టాక్సీవాలా’ వంటి హిట్ చిత్రాలతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్. ఆయన బుధవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తాను చేస్తున్న ప్రాజెక్ట్‌లు, భవిష్యత్ ప్రణాళికలు, తన కెరీర్‌ను గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “మారుతి దర్శకుడిగా పరిచయమైన ‘ఈ రోజుల్లో…’తో నిర్మాతగా నా ప్రయాణం కూడా మొదలైంది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన హిట్ మూవీ ‘టాక్సీవాలా’తో పూర్తిస్థాయి నిర్మాతగా ఓ విజయవంతమైన ముందడుగు వేశాను. సాయిధరమ్ తేజ్ హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నాను. ప్రస్తుతం హీరో గోపీచంద్, దర్శకులు మారుతి, హీరోయిన్ రాశీఖన్నా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే దర్శకుడు మారుతి అండ్ టీమ్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాను నేను, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాం. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మారుతి వెల్లడిస్తారు. రచయిత, దర్శక- నిర్మాత సాయి రాజేష్‌తో అసోసియేట్ అయి మూడు సినిమాలు చేయనున్నాను.

అలాగే ‘కలర్‌ఫోటో’ దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆషాడ మాసం వెళ్లిపోయిన తర్వాత తెలియజేస్తాం. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, వీఐ ఆనంద్, ‘పలాస’ ఫేమ్ కరుణ్ కుమార్‌లతో సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ‘త్రీ రోజేస్’, జీ5, ఓ ఇంటర్నేషనల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్‌సిరీస్ గురించిన చర్చలు తుదిదశలో ఉన్నాయి. కొత్త ప్రతిభావంతులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో మారుతి, నేను కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించి వెబ్ కంటెంట్‌ను వ్యూయర్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్‌సిరీస్‌లు సెట్స్‌పై ఉన్నాయి. ఇక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఏ ఓటీటీ, ఏ ఏటీటీ ఫ్లాట్‌ఫామ్ కూడా రీ ప్లేస్ చేయలేవు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఈ సమయంలో వెళ్లడంలో తప్పులేదెమో. కానీ థియేటర్స్ వ్యవస్థ లేకపోతే స్టార్‌డమ్ తగ్గిపోతుంది. థియేటర్స్ వ్యవస్థ మనుగడ బాగుండాలి. అది థియేటర్స్‌కు మాత్రమే కాదు..ఇండస్ట్రీకి కూడా మేలు”అని అన్నారు.

Producer SKN to Open New Banner Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News