Friday, April 26, 2024

దాసరిలాగా రాణించాలన్నదే నా కోరిక

- Advertisement -
- Advertisement -

చిత్ర పరిశ్రమలోని పలు విభాగాల్లో సక్సెస్ సాధించాలన్నదే తన లక్షమని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, నటుడు సురేష్ కొండేటి. ఈ మధ్యే ‘దేవినేని’ సినిమాలో సెకండ్ లీడ్ పాత్రలో నటించి మెప్పించిన సురేష్ బుధవారం తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
డిస్ట్రిబ్యూటర్‌గా రాణించి…
సినిమాల్లో నటించాలని 1992లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నటుడికి కావలసిన లక్షణాలు లేవని ఆ తరువాత తెలుసుకున్నాను. అనంతరం జర్నలిస్ట్‌గా మారి పలు దిన పత్రికల్లో పనిచేశాను. ఈ నేపథ్యంలో చిరంజీవి, నాగార్జునతో సహా పలువురు స్టార్ హీరోలందరితో మంచి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టాను. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. అనంతరం ఎస్‌కె పిక్చర్ పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో మొదలెట్టి పలు సినిమాలు చేశాను.
నవంబర్ 14న ‘సంతోషం అవార్డులు’…
‘సంతోషం అవార్డులు’ వేడుకను గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నాను. కోవిడ్ సమయంలో రెండేళ్లు మాత్రం జరపలేదు. అయితే నవంబర్ 14న హైదరాబాద్ హెచ్‌ఐసిసిలోని నోవాటెల్ హోటల్‌లో 20వ ‘సంతోషం అవార్డులు’ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాము.
ఎస్పీ బాలు పేరుతో అవార్డులు…
ఈ సారి ‘సంతోషం అవార్డులు’ వేడుకలో ఎస్పీ బాలు పేరుతో ఐదు భాషల్లో మేల్, ఫిమేల్ సింగర్స్ పదిమందికి అవార్డులను ఇవ్వబోతున్నాం. 2019, -2020 రెండు సంవత్సరాల అవార్డుల వేడుకను ఒకే వేదికపై నవంబర్ 14న సాయంత్రం 4 గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు నిర్విరామంగా జరుపబోతున్నాము.
నిర్మాతగా మారి…
నేను మొదట ‘ప్రేమిస్తే’ సినిమాకు నిర్మాతగా చేశాను. ఆ సినిమా హిట్ కావడంతో ఆ తరువాత ‘జర్నీ’, ‘పిజ్జా’… ఇలా 15 సినిమాలు చేశాను.
నటుడిగా పలు సినిమాల్లో…
1995లో వచ్చిన ‘రాంబంటు’ సినిమాలో మొదటిసారి తెరపై నటుడిగా కనిపించాను. అయితే ‘దేవినేని’ సినిమాలో నేను సెకండ్ లీడ్ హీరోగా చేశాను. ఆ ఉత్సాహంతో హీరోగా కూడా చేయాలన్న కోరిక ఉంది. ప్రస్తుతం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, నేను నిర్మాతగా చేస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాను. ‘ఎర్రచీర’లో కూడా నటించాను. ఇక నాకు దాసరి నారాయణ రావు స్ఫూర్తి. ఆయనలా నటుడిగా, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్‌గా… ఇలా పలు విభాగాల్లో రాణించాలన్నదే నా కోరిక.

Producer Suresh Kondeti Birthday Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News