Monday, April 29, 2024

త్వరలో యుపిలో ఎకె-203 రైఫిల్స్ ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

Production of AK-203 rifles in UP soon

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఒక ఫ్యాక్టరీలో ఈ ఏడాది చివరి నాటికి తయారీని భారత్-రష్యా సంయుక్త సంస్థ ప్రారంభిస్తుందని రష్యాకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. అమేథీ జిల్లాలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రష్యాకు చెందిన కలష్నికోవ్ అస్సాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి కోసం 2019లో ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పడింది. ఈ ఏడాది ముగింపు నాటికి కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కలష్నికోవ్ ఎకె203 అస్సాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని రష్యా ప్రభుత్వానికి చెందిన రక్షణ సంస్థ రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్ డైరెక్టర్ జనరల్ అలెక్జాండర్ మిఖీవ్ తెలిపారు. ప్రఖ్యాతిగాంచిన రష్యా అస్సాల్ట్ రైఫిల్స్‌ను భారతదేశంలో వంద శాతం స్థానికంగా ఉత్పత్తి చేయాలన్నదే తమ ఆలోచనని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ ఉమ్మడి సంస్థ ద్వారా మరింత అధునాతన కలష్నికోవ్ అస్సాల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు వాటి సంఖ్యను పెంచాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News