Monday, May 6, 2024

సమయం మించింది.. ఇక సంగీతం చాలించండి

- Advertisement -
- Advertisement -

సమయం మించింది.. ఇక సంగీతం చాలించండి
ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్‌కు పోలీస్‌ల షాక్
పుణె: పుణెలోని రాజా బహదూర్ మిల్స్‌లో ఆదివారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ షోను సమయం మించి పోయిందని పోలీస్‌లు హఠాత్తుగా వచ్చి ఆపు చేయించడం చర్చనీయాంశం అయింది. ఆదివారం రాత్రి రెహ్మాన్ బృందం సంగీత కార్యక్రమం శ్రోతలను ఆనందంలో ముంచెత్తింది. ఈ సంగీత కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ సమయంలో పోలీస్ అధికారి వేదిక పైకి వచ్చి రాత్రి 10 గంటలు దాటిపోయిందని, రెహ్మాన్‌ను, తోటి కళాకారులను నిర్వాహకులను తక్షణం ఆపివేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం వచ్చారు. రాత్రి 10 గంటల గడువు దాటిపోయిందని, తాము రెహ్మాన్‌ను ఇతర కళాకారులను ఆపేయాలని చెప్పగా, వారు ఆపేశారని బుంద్ గార్డెన్ పోలీస్ స్టేసన్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ పాటిల్ చెప్పారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News