Monday, April 29, 2024

నడకలో ఐర్లాండ్ ప్రవాస భారతీయుడి గిన్నిస్ రికార్డు!

- Advertisement -
- Advertisement -

లండన్: పంజాబ్‌లో పుట్టి యాభై ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్న ఓ 73 ఏళ్ల వృద్ధుడు రెండోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నాడు. మొత్తం 80 వేల కిలోమీటర్లు అంటూ భూమి చుట్టుకొలతకు రెండితల దూరం నడిచినందుకు ఆయన ఈ రికార్డు సృష్టించబోతున్నారు. దానికి ఆయన డబుల్ ఎర్త్ వాక్ అని కూడా పేరు పెట్టారు.1,114 రోజుల్లో అంటే 2020లో తాను మొదటిసారి పూర్తి చేసిన దానికన్నా 382 రోజులు తక్కువలో ఒంటరిగా కాలినడకన ఈ యాత్రను పూర్తి చేసినందుకుగాను వినోద్ బజాజ్ అనే ఈ వృద్ధుడు గత వారం గిన్నిస్ సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి రోజూ తాను ఇంతదూరం నడుస్తుండడం పట్ల తన భార్య సంతోషంగా లేదని, ఎందుకంటే ఇది తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆమె భయపడుతోందనితన సొంతపట్టణమైన ఐర్లాండ్‌లోని లిమరిక్‌నుంచి పిటిఐతో మాట్లాడుతూ వినోద్ అన్నారు. అయితే ఇకపై కూడా తాను నడక కొనసాగిస్తానని, అయితే పడిచే దూరం, సమయం తగ్గించుకుంటానని ఆయన అంటూ ఎందుకంటే నడవడం తనకెంతో ఇష్టమని చెప్పారు.కొన్ని కిలోల బరువు తగ్గించుకోవడం కోసం, ఫిట్‌గా తయారవడం కోసం 2016ఆగస్టులో బజాజ్ మొదట్లో నడక ప్రారంభించారు.

అయితే ఆ తర్వాత నడవాలనే ఆయన ఉత్సుకత రెట్టింపు అయింది. ఆరు నెలల కాలంలో తాను దాదాపు 20 కిలోల బరువు తగ్గినట్లు ఆయన చెప్పారు. కేవలం నడకవల్లే తాను బరువు తగ్గానని, దీనివల్ల తన తిండి అలవాట్లలో పెద్దగా మార్పులుచేయాల్సిన అవసరం రాలేదని కూడా ఆయన చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్, బిజినెస్ కన్సల్టెంట్ అయిన వినోద్ చైన్నైలో పెరిగారు. అనంతరం గ్లాస్గోలో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ కోర్సు చేయడం కోసం1975లో స్కాట్లాండ్‌కు వెళ్లారు. అయితే ఉద్యోగరీత్యా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అప్పటినుంచి 39 ఏళ్లుగా ఆయన కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన దరఖాస్తు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే వినోద్ ఇంతకన్నా పెద్ద లక్షం అంటే పది వేల కిలోమీటర్లు నడవాలని లక్షంగా పెట్టుకున్నారు. అంతేకాదు నడకను అలవాటుగా చేసుకునే వారు మొదట్లో తక్కువ రోజువారీ లక్షాన్ని పెట్టుకుని క్రమంగా పెంచుకుంటూ పోవాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మీ శరీరం చెప్పే మాటను వినాలని వినోద్ సలహా ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News