Friday, May 3, 2024

యంగ్ స్టార్‌తో బీచ్ సాంగ్

- Advertisement -
- Advertisement -

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో బీచ్ సాంగ్‌కి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్, పటాయా, గోవా, మారిషస్ లాంటి దీవుల్లో ఆయన ఒక బీచ్ సాంగ్‌ను తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు. బికినీ బీచ్‌లో ఒక సాంగ్ అయినా ఉండాలనేది అతడి రూల్. ఇప్పటి వరకు పూరి డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ హాట్ రొమాంటిక్ బీచ్ సాంగ్స్ హీటెక్కించాయి. శివమణి, సూపర్, దేశ ముదురు, గోలీమార్, పోకిరి, బిజినెస్‌మ్యాన్, టెంపర్, హార్ట్ ఎటాక్, లోఫర్, ఇస్మార్ట్ శంకర్… ఇలా దాదాపు అన్ని సినిమాలను బీచ్ పాటలతో మైమరపించిన ఘనత పూరీకి దక్కుతుంది. బీచ్ సాంగ్స్ ఓ సక్సెస్ మంత్రంగాను పనిచేశాయి. అందుకే మరోసారి అదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నాడట. విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’కి ఈ సెంటిమెంట్ వర్తింపజేస్తున్నాడట. ఇందులో మంచి ఊపున్న హాట్ బీచ్ సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పట్టుబట్టి మరీ విజయ్‌ని ఒప్పించాడట పూరి. కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి రాగానే మారిషస్ లేదా మాల్దీవుల్లో ఈ పాటను చిత్రీకరించాలన్నది ప్లాన్. బీచ్ సాంగ్ విజయ్ దేవరకొండకు తొలి అనుభవం అవుతుంది. ఒక రకంగా రిలాక్స్ ట్రీట్ అనుకోవచ్చు. పూరి మార్క్ క్రియేటివిటీ…రౌడీ స్టార్ క్రేజ్ కలిస్తే ఈ బీచ్ సాంగ్ ఓ రేంజ్‌లో వర్కవుటవుతుందనే అంచనా. హీరోయిన్ అందాల ఎలివేషన్ ఇలాంటి పాటలో పీక్స్ లోనే ఉంటుంది. ఇక ‘లైగర్’ కి బీచ్ సాంగ్ సెంటిమెంట్ ఏమేరకు వర్కవుటవుతుందో చూడాలి.

Puri Jagannath plan to Beach Song with Vijay Devarakonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News