Friday, April 26, 2024

రిజిస్ట్రేషన్‌లు బంద్

- Advertisement -
- Advertisement -

Dharani website

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఈనెల 21 వరకు మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్‌లుగా వ్యవహరిస్తున్న తహసిల్ దార్ల వద్ద ధరణీ ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు జరుగవని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ధరణీ లో ఈ నెల 12 నుండి 21.05.2021 తేదిలలో రిజిస్ట్రేషన్ లకు ధరణీ ద్వారా స్లాట్ లు బుక్ చేసుకున్న వారి స్లాట్ లను రిషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు చెల్లుబాటు అవుతాయని, రిషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు.లాక్ డౌన్ నిబంధనల మినహాయింపు కార్యక్రమాలలో ధరణీ లావాదేవీలు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ధరణీ ద్వారా రిజిస్ట్రేషన్లకు కొనుగోలుదారు, అమ్మకం దారు తో పాటు ఇద్దరు సాక్షులు కలిపి మొత్తం నలుగురు వ్యక్తులైన హాజరు కావాల్సివుంటుందని తెలిపారు. తద్వారా మండల కార్యాలయాలలో రద్దీ పెరుగుతుందని, కోవిడ్ నిబంధనలు మేరకు అమలు సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు.

Telangana Lockdown: Dharani Registrations stopped

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News