Friday, May 3, 2024

నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada-Ajay-Kumar

హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు. నాడు పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టిన నేతలే నేడు దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును సిఎం కెసిఆర్ వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. పోలిరెడ్డిపాడు సామర్థ్యాన్ని వైఎస్ పెంచుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరెత్తలేదని పువ్వాడ ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు కూడా లబ్ధి చేకూరుతుందని మంత్రి అజయ్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 3లక్షల హెక్టార్లు ఆయకట్టు స్థిరీకరించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

Puvvada Ajay Kumar Fires on Congress Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News