Tuesday, May 14, 2024

పివి రమేశ్ ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదు : సిఐడి వర్గాల స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేశ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పివి రమేష్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారని అనడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. రమేష్ గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పివి రమశ్ వ్యాఖ్యలపై సిఐడి వర్గాలు స్పందించాయి. పివి రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదని సిఐడి పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో పివి రమేశ్ స్టేట్‌మెంట్ ఒక భాగం మాత్రమేనని తెలిపింది.

ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయని వెల్లడించింది. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయని తెలిపింది. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లామని వివరించింది. కేసు కోర్టు పరిధిలో ఉండగా పివి రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమేనని పేర్కొంది. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది. నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పివి రమేశ్ పట్టించుకోలేదని తెలిపింది. రూ.371 కోట్లు విడుదల చేసే ముందు, అంత మొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టు కాదని ఆమె వారించారని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్‌కు ముందుగా విడుదల చేద్దామని పివి రమేశ్ గట్టిగా సూచించారని తెలిపింది. ఎక్కడో గుజరాత్‌లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని చెప్పింది. ఈ అభ్యంతరాలను, సూచనలను పివి రమేశ్ పక్కనపెట్టారని తెలిపింది. ఈ కేసులో ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయని సిఐడి ర్గాలు వెల్లడించాయి. పివి రమేశ్ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్ చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News