Monday, May 6, 2024

తీరు మారని సింధు

- Advertisement -
- Advertisement -

PV Sindhu is reeling from series of defeats

వరుస ఓటములతో సతమతం

మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఒకప్పుడూ మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన సింధు కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తోంది. ఒలింపిక్స్ పతకం మినహా ఇటీవల సింధు సాధించిన టైటిల్ ఒక్కటి కూడా లేక పోవడం గమనార్హం. ఒకప్పుడూ సింధును ఫైనల్ ఫొబియా వెంటాడేది. ఆడిన చాలా టోర్నీల్లో ఫైనల్ వరకు దూసుకెళ్లి తుది మెట్టుపై బోల్తా పడేది. కానీ కొంతకాలంగా సింధు ఆట పూర్తిగా తీసికట్టుగా తయారైంది. టైటిల్ సాధించే మాట అటుంచి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరడమే గగనంగా మారింది. చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, చైనీస్ తైపీ షట్లర్లు వరుస టైటిల్స్‌తో ప్రపంకపనలు సృష్టిస్తుండడంగా సింధు మాత్రం కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండానే చేతులెత్తేస్తోంది. తాజాగా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింధు రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

ఈసారి టైటిల్ సాధిస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్ ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశ పరిచింది. వరుస ఓటములు ఎదురవుతున్నా ఆటను మెరుగు పరుచుకోవడంపై సింధు దృష్టి సారించడం లేదు. ప్రత్యర్థి దేశాల షట్లర్లు రోజురోజుకు తమ ఆట తీరును గాడిలో పెట్టుకుంటుంటే సింధు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. సింధు ఆట తీరుపై అభిమానులు సయితం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహచర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాదిరిగానే సింధు కూడా ఆటకంటే వాణిజ్య పరమైన అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఆట గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. వరుస ఓటములు ఎదురవుతున్నా సింధు ఆటను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ సయితం ఈ విషయంలో సింధుకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. దీంతో తెలుగుతేజం సింధు ఆట రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News