Wednesday, May 1, 2024

ఎలా కనిపించినా కష్టంగానే…

- Advertisement -
- Advertisement -

Roy Lakshmi says about role in movies

 

మూస పాత్రలు చేసేందుకు నేను ఇండస్ట్రీకి రాలేదని అంటోంది రాయ్ లక్ష్మీ. హీరోయిన్‌గా, ఐటమ్ సాంగ్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ అమ్మడు బోల్డ్ పాత్రలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉంది. బోల్డ్ పాత్రల విషయంలో ఈ అమ్మడి వాదన వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ పాత్ర గ్లామర్‌గా ఉంటే తక్కువ కష్టం ఉంటుందని.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు అయితే ఎక్కువ కష్టం ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఆ విషయం ఏమాత్రం నిజం కాదు… సినిమాలో ఎలా కనిపించినా కష్టంగానే ఉంటుందని రాయ్ లక్ష్మి చెప్పుకొచ్చింది. “కథానాయిక అన్నప్పుడు గ్లామర్ పాత్రలు చేయాలి… నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలి. ఏ పాత్ర చేసినా కూడా దానికి పూర్తి న్యాయం చేసే విధంగా నటించాల్సి ఉంటుంది. కథానుసారంగా బోల్డ్ పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే కొన్ని సందర్భాల్లో నాయిక ప్రధాన సినిమాలు చేసినప్పుడు బోల్డ్‌గా నటించాల్సి రావచ్చు. ఎలాంటి పాత్రలు అయినా, ఎలాంటి సీన్స్‌లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించగలరు”అని రాయ్ లక్ష్మీ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News