Sunday, April 28, 2024

టెన్నిస్ కింగ్

- Advertisement -
- Advertisement -

కొత్త చరిత్ర సృష్టించిన రఫెల్ నాదల్

ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ప్రస్తుతం ముగ్గురు దిగ్గజాలదే ఆధిపత్యం నడుస్తోంది. వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)లు మాత్రమే గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్‌లో నాదల్, ఫెదరర్ బరిలోకి దిగలేదు. ఇక నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థిమ్ యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగురేసుకు పోయాడు. అయితే ఒక్క ఫలితం మినహాయిస్తే పురుషుల టెన్నిస్‌లో జకోవిచ్, నాదల్, ఫెదరర్‌ల లో ఎవరో ఒకరూ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలువడం అనవాయితీగా వస్తోంది.

మన తెలంగాణ/క్రీడా విభాగం: మధ్యలో వెల్‌ఫ్రెడ్ సొంగా, ఆండీ ముర్రే తదితరులు ఒకటి రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించారు. ముఖ్యంగా నాలుగైదు సంవత్సరాల ఫలితాలు గమనిస్తే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరూ ట్రోఫీని గెలుచుకుంటు న్నారు. కిందటి ఏడాది జకోవిచ్ మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించగా ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ విజేతగా నిలిచాడు. అంతకుముందు సంవత్సరం కూడా నాదల్, జకోవిచ్, ఫెదరర్‌లు ట్రోఫీలను పంచుకున్నారు. మధ్యలో గాయం వల్ల జకోవిచ్ దూరమైన సమయంలో ఫెదరర్, నాదల్‌లు వరుస టైటిల్స్‌తో సత్తా చాటారు.
నాదల్ నయా రికార్డు..
ఇక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో స్పెయిన్ బుల్ నాదల్ తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన రికార్డును సాధించాడు. నాదల్ కెరీర్‌లో ఇది 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక ఆటగాడు ఇన్నిటైటిల్స్ సాధించడం ఇదే తొలిసారి. ఇక ఓవరాల్‌గా నాదల్ ఇప్పటి వరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెదరర్ పేరిట ఉన్న 20 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీల రికార్డును నాదల్ సమం చేశాడు. ఒక టైటిల్‌ను సాధిస్తే నాదల్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలుస్తాడు.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఫెదరర్ కెరీర్ చరమాంకంలో పడిందనే చెప్పాలి. యువ ఆటగాళ్లను తట్టుకుని ఫెదరర్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక టైటిల్స్ రికార్డు నాదల్ లేదా ప్రస్తుత నంబర్‌వన్ జకోవిచ్‌లకే సాధ్యమని చెప్పక తప్పదు. అయితే నాదల్ రికార్డును సమం చేయాలంటే జకోవిచ్ మరో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాలి. థిమ్, జ్వరేవ్, దిమిత్రోవ్, సిట్సిపాస్, మెద్వెదేవ్, షావర్ట్‌మాన్, షవ్‌పలావ్ వంటి యువ ఆటగాళ్లు అసాధారణ రీతిలో రాణిస్తున్న ప్రస్తుత తరుణంలో జకోవిచ్ ఇన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తాడా అన్నిది సందేహమే. ఇక స్పెయిన్ స్టార్ నాదల్‌కు ఎలాగో ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరుగులేదు. వచ్చే ఏడాది అతను ఈ టైటిల్‌ను సాధిస్తే పురుషుల టెన్నిస్‌లో మకుటం లేని మహారాజుగా నిలిచి పోతాడు.

Rafael Nadal won 13th French Open Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News