Sunday, April 28, 2024

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా ఆగిపోతుందని, కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసి దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ కారణంగా తాము ఏమీ చేయలేకపోతున్నామని, సరిగ్గా పార్లమెంట్ ఎన్నకలకు రెండు నెలల ముందు ఇలా చేయడం దారుణమైన విషయమని స్పష్టం చేశారు. విపక్ష బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌పై ఫిర్యాదు చేసినా ఇసి స్పందించడంలేదని, కాంగ్రెస్ ఖాతాను ప్రధాని నరేంద్ర మోడీ నేరపూరితంగా ఫ్రీజ్ చేశారని ధ్వజమెత్తారు. ఈ చర్యతో భారత్‌లో ప్రజాస్వామ్యం అబద్ధమైపోయిందని, నెల క్రితమే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారని రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఇంత దారుణం జరుగుతుంటే అంతా చోద్యం చూస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల వేళ తాము కనీసం పోస్టర్లు కూడా వేసుకోలేకపోతున్నామని రాహుల్ వివరించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట అని బిజెపి రాజకీయాలను ఉద్దేశించి చురకలంటించారు. సీతారామ్ కేసరి కాలం నాటి అంశాలపై ఇప్పుడు నోటీసులు ఇచ్చారని, చిన్ని చిన్ని లోపాలను అడ్డంపెట్టుకొని తీవ్రమైన చర్యలు చేపడుతున్నారని, ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజాస్వామ్యం బతకడం కష్టమన్నారు. కోర్టులు, ఇసి, ఇన్ని వ్యవస్థలు ఉండి ఏం లాభమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News