Friday, May 3, 2024

భారత మాతకు వ్యవసాయమొక్కటే వ్యాపారం: సాగు చట్టాలపై రాహుల్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

భారత మాతకు వ్యవసాయమొక్కటే వ్యాపారం
ప్రపంచం చూస్తోంది..కాని కేంద్రానికే పట్టడం లేదు
సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ధ్వజం

Rahul Gandhi leads tractor rally against farm laws in Kerala

వయనాడ్(కేరళ):వ్యవసాయం ఒక్కటే భారత మాతకు చెందిన వ్యాపారమని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహ రించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా సోమవారం తన నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
జిల్లాలోని త్రికాయిపట్టా నుంచి ముట్టిల్ వరకు ఆరు కిలోమీటర్లు సాగిన ట్రాక్టర్ ర్యాలీలో పాలొన్న అనంతరం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ రైతులు ఎదుర్కొంటున్న వెతలను యావత్ ప్రపంచం చూస్తోందని, కాని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రైతుల కష్టాలు పట్టడం లేదని ఆరోపించారు. భారతీయ రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితికి పాప్ స్టార్లు సైతం మద్దతు తెలుపుతున్నారని, కాని భారతీయ ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ పట్టడం లేదని ఆయన విమర్శించారు. ఒత్తిడ తీసుకురానంత వరకు కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించుకోదని ఆయన చెప్పారు. దేశంలోని వ్యవసాయ విధానాన్ని నాశనం చేసి ప్రధాని నరేంద్ర మోడీ మిత్రులు ఇద్దరు, ముగ్గురికి మొత్తం వ్యాపారిన్న కట్టబెట్టడానికి ఈ మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించారని ఆయన ఆరోపించారు. భారతదేశంలో రూ.40 లక్షల కోట్ల విలువైన అతి పెద్ద వ్యాపారం వ్యవసాయమని, ఇది కొన్ని కోట్ల మందికి చెందిన వ్యాపారమని రాహుల్ అన్నారు. భారత మాతకు చెందిన ఏకైక వ్యాపారమైన వ్యవసాయాన్ని చేజిక్కించుకోవడానికి కొందరు వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Rahul Gandhi leads tractor rally against farm laws in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News