Wednesday, May 1, 2024

వృద్ధులకు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్: రాహుల్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరిక భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన జన గర్జన సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కెసిఆర్ లాక్కున్నారు. టిఆర్ఎస్ ఏకంగా తన పార్టీ పేరే మార్చుకుంది. కెసిఆర్ తెలంగాణకు రాజులా భావిస్తున్నారని, ఈ భూములు కెసిఆర్ వి కావు ఈ భూములు మీవి అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఖిల్లా అని,మీ మనసుల్లో .. మీ రకతంలో కాంగ్రెస్ ఉందని,పీపుల్ మార్చ్ చేసిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

వేల కి.మీ. పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని,పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలుకుతున్నానని ఆయన అన్నారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నందుకు పొంగులేటికి రాహుల్ గాంధీ ధన్నవాదాలు తెలిపారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని,తెలంగాణ ఓ స్వప్నంగా ఉండేదని,తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో తిరిగినప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నానని మరో ఆరు నెలలో తెలంగాణలో పరిస్థితి మారబోతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News