Wednesday, May 8, 2024

ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదు: రాహుల్‌

- Advertisement -
- Advertisement -

Rahul-gandhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ చేసిన ‘ట్యూబ్‌లైట్’ వ్యాఖ్యను కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. ఒక దేశ ప్రధానిలా ఆయన వ్యవహరించడం లేదన్నారు. తను ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడానికే లోక్‌సభలో పథకం ప్రకారం గందరగోళాన్ని సృష్టించారని ఆరోపించారు. ‘సాధారణంగా ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఒక స్థాయి, ప్రవర్తించే తీరు, ఔన్నత్యమూ ఉంటాయి, కానీ మన ప్రధానమంత్రికి అవి లేవు.

ప్రధాని స్థాయిలో ఆయన ప్రవర్తించడం లేదు’ అని రాహుల్‌గాంధీ శుక్రవారం పార్లమెంట్ బయట విలేకరులతో అన్నారు. గురువారంనాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ మోడీ చేసిన ‘ట్యూబ్‌లైట్’ గురించి విలేకరులు రాహుల్‌ను అడగ్గా కాంగ్రెస్ నాయకుడు ఈవిధంగా స్పందించారు. ‘మమ్మల్ని అణచేస్తున్నారు. పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతించడం లేదు. మా గొంతు నొక్కుతున్నారు’ అని కూడా రాహుల్ అన్నారు.

Rahul Says PM Modi Doesnt Behave Like Prime Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News