Saturday, May 4, 2024

ప్యాసింజర్ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు

- Advertisement -
- Advertisement -

Railway is converting passenger Train into express Trains

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చుతోంది. ప్రయాణదూరం 200 కి.మీల కంటే ఎక్కువ ఉన్న ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తోంది. ఈ మార్పుతో చిన్న చిన్న స్టేషన్‌ల లో రైళ్లు ఆగవు. దీంతోపాటు ప్రయాణ చార్జీలు పెరుగుతాయని అధికారులు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ టు పర్బని (57563), హెచ్‌ఎస్ నాందేడ్ టు హైదరాబాద్ (57564) ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. ఈ సర్వీసుల్ని తాండూరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివలన లింగంపల్లి, వికారాబాద్ వాసులకు ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ స్టేషన్ (నాంపల్లి) నుంచి బయలుదేరిన ఈ రైళ్లు ఇక నుంచి తాండూరు నుంచి మొదలవుతాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ మీదుగా అక్కన్నపేట, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా మహారాష్ట్రలోని హెచ్‌ఎస్ నాందే డ్, పర్బని వెళతాయి. రిజర్వేషన్ ఉన్న వారికే ఇందులో ప్రయాణించే అవకాశం ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News