Friday, May 3, 2024

తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

- Advertisement -
- Advertisement -

Rain Alert in Telangana for next 2 days

హైదరాబాద్: బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 3, 4 తేదీల్లో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయ. సోమవారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. నవంబర్‌ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నవంబర్‌ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

Rain Alert in Telangana for next 2 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News