Monday, April 29, 2024

కార్తికేయ నటన హైలెట్‌గా…

- Advertisement -
- Advertisement -

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి, నిర్మాత రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
స్టయిలిష్, రిచ్‌గా…
సినిమా టీజర్‌ను విడుదల చేసినప్పుడు రెండు మూడు మిలియన్ వ్యూస్ వస్తాయని అనుకున్నాం కానీ, ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. టీజర్ చాలా స్టయిలిష్, రిచ్‌గా ఉందని చెబుతున్నారు.
హిందీ రైట్స్ 3.25 కోట్లకు…
మా దర్శకుడు శ్రీ సరిపల్లి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేశాడు. ఆ అనుభవంతో మన తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాడు. మా సినిమా హిందీ రైట్స్‌ను 3.25 కోట్లకు కొనుగోలు చేశారు.
ఈ సినిమా మరో ఎత్తు…
కార్తికేయ చేసిన ప్రతి సినిమా మాకు ఇష్టమే. అన్నిటి కంటే ‘గ్యాంగ్ లీడర్’ చాలా ఇష్టం. అందులో ఆయన నటన చాలా బావుంటుంది. అంతకు మించి మా ‘రాజా విక్రమార్క’ చిత్రంలో నటించారు. కార్తికేయ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
తదుపరి చిత్రాలు…
రెండు బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయి. ‘రాజా విక్రమార్క’ సక్సెస్ మీట్‌లో కొత్త సినిమాను ప్రకటిస్తాం.

Producer Rama Reddy about ‘Raja Vikramarka’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News