Tuesday, May 21, 2024

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన..

- Advertisement -
- Advertisement -

Rainfall in Telangana for next 3 days

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనలో తీవ్రత ఎక్కువగా హైదరాబాద్ పరిధిలోనే ఉందని, అందుకే ఈ నెలలో ఆ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు అలుగు పారాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.

Rainfall in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News