Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rains lash many parts of Hyderabad

హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, అమీర్ పేట్, అభిడ్స్ ,కోఠి, నాంపల్లి, నారాయణగూడ మలక్ పేట, మిథాని, సనత్ నగర్, ఎల్బీనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం పడుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇవాళ ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే గురువారం రాత్రి నుంచి భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Rains lash many parts of Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News