Saturday, May 4, 2024

సాయుధదళాలకు పూర్తి స్వేచ్చనిచ్చిన రక్షణశాఖ

- Advertisement -
- Advertisement -

Rajnath Singh held a high level review meeting

న్యూఢిల్లీ: లడఖ్ లో పరిస్థితులపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాదళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సమీక్షించారు. చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని రాజ్‌నాథ్ వారికి ఆదేశించారు. జల, వాయు, భూమార్గాల్లో చైనా కార్యకలాపాలపై నిఘా పెట్టాలని తెలిపారు. చైనా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడిన దీటుగా బదులు ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వాడానికి సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ భద్రతా దళాలను ఆదేశించారు. దీంతో సాయుధదళాలకు రక్షణశాఖ పూర్తి స్వేచ్చనిచ్చింది. చైనా సరిహద్దుల వద్ద వ్యూహాత్మక విధానాన్ని అవలంబించాలని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News