Tuesday, May 14, 2024

డ్యూయల్ రోల్‌లో చరణ్

- Advertisement -
- Advertisement -

ram charan to play dual role in next movie

స్టార్ హీరో రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న ‘ఆర్‌సి15’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, – శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా శంకర్ శైలిలో సందేశాత్మక అంశాలతో రూపొందే కమర్షియల్ చిత్రం అని సమాచారం. అంతేకాదు ఇది ‘ఒకే ఒక్కడు’ తరహాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని.. ఇందులో చరణ్ పొలిటీషియన్‌గా నటిస్తాడని అంటున్నారు.

అయితే ఇప్పుడు మెగా అభిమానులను సంతోషపరిచే విషయం తెలిసింది. అదేమిటంటే శంకర్ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడట. గతంలో చరణ్ ‘నాయక్’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలో ఈ స్టార్ హీరో మరోసారి ‘ఆర్‌సి15’తో డబుల్ రోల్‌లో మెప్పిస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే శంకర్, – చరణ్ సినిమా కోసం డైలాగ్స్ రాయడానికి ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ ని తీసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న శంకర్ వీటిని దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే క్రమంలో నటీనటులు, – సాంకేతిక నిపుణులను కూడా ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

ram charan to play dual role in next movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News