Wednesday, May 1, 2024

ఆ ట్వీట్ నేను చేయలేదు : వర్మ

- Advertisement -
- Advertisement -

Ram Gopal Varma Makes Cryptic Tweet

మనతెలంగాణ/హైదరాబాద్ : సంచలన వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో నిలిచే రాంగోపాల్ వర్మ తాజాగా తెలంగాణలో ఈటల రా జేందర్ అంశానికి, టిడిపి అధినేత చంద్రబాబుకు ముడిపెడుతూ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. ఈటల రాజేందర్ సిఎం కెసిఆర్ కు వెన్ను పోటు పొడిచిన వ్యవహారానికి, చంద్రబాబు ఎన్‌టిఆర్‌కుకు వెన్నుపోటు పొడిచిన వ్యవహారం ఒకేలా అనిపిస్తున్నాయంటూ వర్మ తెలిపినట్టుగా ఆ ట్వీట్ ఉం ది. దీనిపై గురువారం నాడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ అది తాను చేసి న ట్వీట్ కాదని, అది ఫేక్ అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచా రమవుతున్న ఆ ట్వీట్‌ను కూడా వర్మ పంచుకున్నారు. దీనిపై అందరితో చర్చించి ‘వెన్నుపోటు ఈటలు’ అనే సినిమా తీద్దామని నిర్ణయించుకున్నట్టు ఆ పోస్టులో వర్మ వివరించినట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News