Tuesday, April 30, 2024

అలాంటి ఘటనల ఆధారంగానే…

- Advertisement -
- Advertisement -

 Ram Gopal varma says about Murder movie

 

అమృత, ప్రణయ్‌ల కథను తాను సినిమాగా తీయలేదని.. అలాంటి ఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా చేశానని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. ‘మర్డర్’ సినిమా విడుదలకు మార్గం సుగమమం కావడంతో ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఇక ‘మర్డర్’ ట్రైలర్ విడుదలైన తరవాత ఈ సినిమాపై వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా తన కథతో రామ్‌గోపాల్ వర్మ సినిమా రూపొందించాడని, దాని విడుదలను ఆపాలని అమృత ప్రణయ్ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ‘మర్డర్’ విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ ‘మర్డర్’ నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమృత, ప్రణయ్, మారుతీరావు పేర్లను వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. నల్గొండ కోర్టు విధించిన స్టేను కొట్టివేసింది. హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రావడంతో రామ్‌గోపాల్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ అమృత, ప్రణయ్‌ల కథను తాను సినిమాగా తీయలేదని.. అలాంటి ఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా చేశానని వర్మ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ “నేను ఒకరిని కించపరచడానికి ఈ సినిమా తీయలేదు. ఒకరు కరెక్ట్ మరొకరు రాంగ్ అని చెప్పడంలేదు. అలాంటి సంఘటన ఎందుకు జరుగుతుంది? అనే విశ్లేషణే నా సినిమా”అని క్లారిటీ ఇచ్చారు. తాను తీసిన సినిమా అమృత కుటుంబం గురించి కాదని.. అలాంటప్పుడు వాళ్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని వర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నట్టికుమార్, నట్టి కరుణ, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News