Friday, May 3, 2024

రామ్ వర్సెస్ రావణ్..

- Advertisement -
- Advertisement -

సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వంలో షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ ‘రామ్ వర్సెస్ రావణ్‘ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కె . శుక్రన్ మాట్లాడుతూ “ఇదొక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు? అనేది సినిమాలో చూపిస్తున్నాం.

యాక్షన్‌తో పాటు ఎంటర్ టైన్‌మెంట్ కథలో కలిసి ఉంటుంది”అని అన్నారు. హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడు తూ “రామ్ వర్సెస్ రావణ్ చిత్రంలో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇదొక ఫెంటాస్టిక్ స్టోరి. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం”అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ః రాజామతి, సంగీతం ః వికాస్ బాడిశ, స్టంట్స్ ః రామ్ లక్ష్మణ్, బి జె శ్రీధర్.

Ram vs Ravan movie Opening Ceremony in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News