Monday, May 13, 2024

మహా శివరాత్రి కానుకగా…

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి, ఆర్‌టి టీమ్ వర్క్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఈ టీజర్ మార్చి 1న మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్‌ను విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్‌లో కనిపించారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. యదార్థ సంఘటనల నుండి స్పూర్తి పొందిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News