Friday, May 3, 2024

రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Rana brother Abhiram escapes unhurt in car accident

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అభిరామ్ తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే… కరీంనగర్ ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనడానికి నగరంలోని మణికొండ వెళ్లాడు. అక్కడ కారు ఓనర్ ను కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని వెళ్లాడు. ఈ తరుణంలోనే పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బిఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ రోడ్డుప్రమాదంలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికి బ్రీత్ అనలైజర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా, ఎవరూ మద్యం సేవించలేదని తెలిసింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Rana brother Abhiram escapes unhurt in car accident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News