Sunday, April 28, 2024

డిజిటల్ కరెన్సీపై ఆర్‌బిఐ పనిచేస్తోంది

- Advertisement -
- Advertisement -

RBI is working on digital currency

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల తగ్గింపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సానుకూల నిర్ణయం తీసుకుంటాయని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలను కరోనా మహమ్మారి ఒత్తిడినుంచి బయటకు తేవడానికి అధికంగా నగదును ఖర్చు చేయాల్సి ఉందన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదల వలన తయారీ ఉత్పత్తి వ్యయంపై ప్రభావం పడి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని చెప్పారు. రిజర్వుబ్యాంక్ డిజిటల్ కరెన్సీపై ఆర్‌బిఐ పనిచేస్తోందని, త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్‌బిఐ గవర్నర్ చెప్పారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News