Monday, April 29, 2024

ప్రతి అంశంపై చర్చకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

పార్టీల నేతలతో ప్రభుత్వం
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్
ఒక రోజు ముందు అఖిల పక్ష సమావేశం

న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మంగళవారం వివిధ పార్టీల సభా నేతలతో చెప్పింది. బడ్జెట్ సెషన్‌కు ముందు ప్రభుత్వం ముండు ఏర్పాటు చేసిన సాంప్రదాయక సమావేశం నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బయటకు వస్తూ, సభా పక్షం నేతలతో ముఖాముఖి ‘అత్యంత సౌహార్ద్రం’గా సాగిందని అభివర్ణించారు. స్వల్ప కాలం జరిగే ఈ సెషన్‌లో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలియజేశారు.

పార్లమెంటరీ ఎన్నికలు ప్రకటించే లోపు ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి సమావేశం. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభలో ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆయన సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న నేతలలో కె సురేష్ (కాంగ్రెస్), సుదీప్ బందోపాధ్యాయ్ (టిఎంసి), టిఆర్ బాలు (డిఎంకె), రాహుల్ షెవాలె (శివసేన), ఎస్‌టి హాసన్ (సమాజ్‌వాది పార్టీ), రామ్ నాథ్ ఠాకూర్ (జెడియు), గల్లా జయదేవ్ (టిడిపి) కూడా ఉన్నారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గేకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారి మాట్లాడుతూ, అస్సాంలో రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రపై ‘దౌర్జన్యపూరిత దాడి’, యాత్రపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల అంశాన్ని తాను ప్రస్తావించినట్లు తెలియజేశారు. ‘దేశంలో ‘అలిఖిత నియంతృత్వం’ నెలకొందని తివారి విమర్శించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలను లక్షంగా చేసుకోవడానికి ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆయన ఆరోపించారు.

ప్రతిపక్షాలను సంప్రదించిన అనంతరం తాను ఈ అంశాలను ప్రస్తావించినట్లు తివారీ వెల్లడించారు. పార్లమెంట్‌లో తాము వివిధ అంశాలను ప్రస్తావించాలని వివిధ పార్టీల నేతలు భావిస్తుంటారు కనుక ప్రతి సెషన్‌కు ముందు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సంప్రదాయం. కాగా, ఈ దఫా సెషన్ సంక్షిప్లంగా ఉంటుంది. బుధవారం (31) నుంచి ఫిబ్రవరి 9 వరకు సెషన్ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఆర్థిక శాఖ మంత్రి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ఈ సెషన్ మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News