Monday, May 6, 2024

పాఠశాల విద్యార్థులకు 30వేల జతల షూస్ పంపిణీ చేసిన రియల్ ఫేజ్

- Advertisement -
- Advertisement -

Real Page distributed 30,000 pairs of shoes to school children

 

హైదరాబాద్ : నగరంలో బాలల దినోత్సవం పురస్కరించుకుని రియల్ పేజ్ ఇండియా పాఠశాల విద్యార్థులకు 30,107 జతల షూస్‌ను విరాళంగా అందజేసింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియలో ఏర్పాటు చేసి నూతన గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఈకార్యక్రమానికి ఏడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులతో పాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో 100కుపైగా పాఠశాలల విద్యార్ధులకు షూస్‌లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి స్పోర్ట్ అథారిటీ ఆప్ తెలంగాణ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా రియల్ ఫేజ్ ఇండియా ఎండీ సందీప్‌శర్మ మాట్లాడుతూ ఇది కేవలం రికార్డు సృష్టించడం వరకు మాత్రమే కాదు, అంతకు మించి ఈరికార్డు ప్రయత్నానికి ఆవల, ఈకార్యక్రమంలో భాగంగా తమ నూతన జత షూస్‌ను అందుకున్న ప్రతి నిరుపేద చిన్నారి ముఖంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈగిన్నీస్ వరల్డ్ రికార్డు టైటిల్ 2021 సంవత్సరానికి మరింత అద్భుతంగా మలిచిందని, మా లబ్దిదారులకు అంతా శుభం జరగాలని మాసంస్ద ఆకాంక్షిస్తుందన్నారు. ఈసందర్భంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి సందేశం పంపి సామాజిక కారణాల కోసం మన కార్పొరేట్స్‌ముందుకు రావడంతో పాటుగా అసలైన ప్రభావాన్ని చూపుతుండటం నాకు పూర్తి సంతృప్తినిస్తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్ధుల కోసం 30వేల జతల షూస్‌ను విరాళంగా అందించడంతో పాటుగా, వరల్డ్ రికార్డ్ టైటిల్ సాధించిన రియల్ ఫేజ్ ఇండియాను అబినందించారు. ఈకార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయష్‌రంజన్, స్వప్నిల్ దంగారికర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News