Saturday, April 27, 2024

రియల్‌మి జిటి 5జి, రియల్‌మి బుక్

- Advertisement -
- Advertisement -

Realme GT 5G Series- Realme Book Slim Launch

న్యూఢిల్లీ : రియల్‌మి సంస్థ తాజాగా దేశీయ మార్కెట్లోకి రియల్‌మి జిటి 5జి సిరీస్, మొట్టమొదటి లాప్ టాప్ రియల్‌మి బుక్ (స్లిమ్)లను ప్రవేశపెట్టింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్888 ప్రాసెసర్‌తో రియల్‌మి జిటి 5జి అందుబాటులోకి వచ్చింది. 120 హెడ్జ్ సూపర్ డిస్‌ప్లేను కలిగిఉంటుంది. 65 డబ్ల్యూ సూపర్ డార్ట్ ఛార్జ్ 4500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, సోనీ 64ఎంపి ట్రిపుల్ కెమెరా ఉంటాయి. డాషింగ్ సిల్వర్, డాషింగ్ బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది.

8+128జిబి ధర రూ.37,999గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 25 నుంచి విక్రయాలు ప్రారంభిచనుంది. రియల్‌మి జిటి 5జి మాస్టర్ ఎడిషన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జి ఎస్‌ఒసిను కల్గివుంది. 6+128జిబి వెల రూ.25,999గా ఉంది. ఇది ఆగస్టు 26 నుంచి విక్రయాలు ప్రారంభిస్తోంది. ఇక రియల్ మి బుక్ (స్లిమ్) అనేది 3:2 స్రీన్ రేషియోతో 14 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. రెండు రంగుల్లో లభ్యమయ్యే 8+256జిబి తో 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ధర రూ.44,999గా ఉంది, ఆగస్టు 30 నుంచి అందుబాటులో ఉంటుంది.

Realme GT 5G Series- Realme Book Slim Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News