Friday, May 3, 2024

కోలుకుంటున్న భారత్

- Advertisement -
- Advertisement -

కోలుకుంటున్న భారత్
73 రోజులకు పెరిగిన డబ్లింగ్ సమయం
87 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఒక్క రోజే 81,514 మంది కోలుకున్నారు
63 వేల కొత్త కేసులు, 680 మరణాలు

Corona cases exceeding 71 lakhs in India

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్ట్డం, కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పట్టడానికి ఎక్కువ సమయం పట్టడం ఊరటనిస్తోంది. ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి (డబ్లింగ్) 25రోజులు పడితే ఇప్పుడది 73 రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. స్వల్పకాలంటో డబ్లింగ్ సమయం 25 రోజులనుంచి 73 రోజులకు పెరగడం వైరస్ వ్యాప్తి నియంత్రణకు సూచికగా ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా రోజువారీ మరణాల సంఖ్య కూడా వెయ్యినుంచి 600కు తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసులకన్నా కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. గడచిన 24 గంటల్లో 63,83,441 కొత్త కేసులు వెలుగు చూడగా, 81,514 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య దాదాపు 64 లక్షలకు చేరుకుంది.

దాదాపు 79 శాతం రికవరీలు పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని, దీంతో కరోనా రికవరీ రేటు 87 శాతాన్ని దాటిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులున్న మహారాష్ట్రలో ఒక్క రోజే 19,000 మందికి పైగా కోలుకోగా, కర్నాటకలో 8000కు పైగా రికవరీలున్నాయని ఆ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్టులను భారీగా నిర్వహించడం, ట్రాకింగ్ ద్వారా వైరస్‌కు గురయిన వారిని సమర్థవంతంగా గుర్తించిమెరుగైన చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలుగుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సమర్థవంతంగా పని చేస్తు న్నట్లు తెలిపింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటుగా వైరస్‌పై పోరులో ముందున్న అన్ని విభాగాల సమ న్వయంతోనే ఇది సాధ్యమయిందని తెలిపింది.
ఇదిలా ఉండగా దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 73 లక్షలను దాటింది. తాజాగా నమోదైన 63 వేలకు పైగా కేసులతో కలుపుకొని ఇప్పటివరకు 73,07,098 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 1,11,266 మంది వ్యాధితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తాజాగా మరో 680 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది. కాగా ప్రస్తుతం దేశంలో 8,12,390 యాక్టివ్ కేసులున్నాయి.
9 కోట్లు దాటిన టెస్టులు
ఇక దేశవ్యాప్తంగా కరోననా నిర్ధారణ పరీక్షలు కూడా భారీగా చేపడుతున్నారు. నిత్యం సగటున పది లక్షలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా 11లక్షల 36 వేల పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 9 కోట్ల 12 లక్షల కొవిడ్ పరీక్షలు పూర్తయినట్లు తెలిపింది. దేశంలో ర్యాపిడ్ టెస్టులతో పాటుగా 1944 ల్యాబ్‌ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 12 కోట్ల టెస్టులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 9 కోట్లకు పైగా టెస్టులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక చైనాలో ఇప్పటివరకు 16 కోట్లకు పైగా పరీక్షలు జరిపినట్లు నివేదికలు ఉన్నా,ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు.

Recovery rate increased to 87 percent in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News