Sunday, April 28, 2024

రిజిస్ట్రేషన్ల సమస్యలకు వారంలో తెర

- Advertisement -
- Advertisement -

క్రయవిక్రయాలు పారదర్శకంగా ఉండాలన్నది సిఎం కెసిఆర్
అభిమతం , సులువైన ప్రక్రియ కోసం సబ్ కమిటీ చర్చించింది
త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించి రిజిస్ట్రేషన్లు
సునాయాసంగా జరిగేలా చూస్తాం, ఆరంభంలో సమస్యలు
ఎదురుకావడం మామూలే, రియల్ ఎస్టేట్‌కు ఎటువంటి
ఇబ్బందులు కలగరాదని సిఎం ఆదేశించారు, ఆ విధంగానే అన్ని
ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎటువంటి
ఇబ్బంది లేదు, ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన వాటిపై త్వరలో ఆలోచించి
నిర్ణయం, తప్పుడు రిజిస్ట్రేషన్లు లేకుండా చేయడానికే టి పిన్
సేల్ డీడ్‌లపై ఉన్న అపోహలను తొలగిస్తాం, జిపిఎ, డిజిపిఎ,
ఎస్‌పిఎలను 2 రోజుల్లో అందుబాటులోకి తెస్తాం, వ్యవసాయేతర
రిజిస్ట్రేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం
మీడియాతో మంత్రి ప్రశాంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: వారం రోజుల్లో రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై చర్చించేందుకు సబ్ కమిటీ బిఆర్‌ఆర్‌కె భవనంలో సమావేశమయ్యింది. ఈ భేటీ ముగిసిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల క్రయ, విక్రయాల దస్తావేజులు పారదర్శకంగా జరగాలన్న ఉద్ధేశ్యంతో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను ప్రారంభించామన్నారు. మొ దట్లో అన్నింట్లో కష్టాలు ఉంటాయని, వాటిని దాటుకొని సౌలభ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని వాటిపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. టి- ఫిన్ నంబర్ అనేది యూనిక్ నంబర్ అని టి పిన్ నంబర్ తప్పుడు రిజిస్ట్రేషన్లు కాకుండా, అవకతవకలు జరగకుండా ఉండేందుకు తీసుకువచ్చామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ల విషయంలో త్వరలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సబ్ కమిటీలో పలు అంశాలపై చర్చ

రియల్‌ఎస్టేట్‌కు ఎలాంటి ఆటంకాలు కలగవద్దని సి ఎం కెసిఆర్ సూచించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని ప్ర జా సంక్షేమ ప్రభుత్వం, ప్రజలకు సులభతరంగా, అందుబాటులో ఉండేవిధంగా పనిచేస్తుందన్నారు. రెండు రోజుల్లో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని  మంత్రి తెలిపారు. అత్యంత సులువైన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ కోసం సబ్ కమిటీలో పలు అంశాలపై చర్చించామన్నారు. క్రయ, విక్రయాలు పారదర్శకంగా జరగాలన్నదే సిఎం కెసిఆర్ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే సమస్యలను అధిగమించి రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను సులువుగా జరిగేలా చూస్తామని మంత్రి హామినిచ్చారు.
రద్దీ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నాలుగు విభాగాలుగా…
స్లాట్ రద్దీ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నాలుగు విభాగాలుగా విభజించామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రద్దీ తక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సబ్ రిజిస్ట్రార్‌లను, ఆపరేటర్‌లను వినియోగదారులు ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు నెలల పాటు సర్ధుబాటు చేసి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌లను వేగంగా పూర్తి చేస్తామన్నారు. మార్చి వరకు పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రిజిస్ట్రేషన్‌లపై బ్యాంకులకు ఉన్న అపోహలను తొలగిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
అవిశ్రాంతంగా అధికారుల బృందం శ్రమ…
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకనుగుణంగా రాష్ట్ర క్రయ, విక్రయాల దస్తావేజులు, రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా, సులువుగా అవినీతికి తావు లేకుండా ఎటువంటి Human Interference లేకుండా చర్యలు చేపట్టామని మంత్రి వేముల తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా ఈ పోర్టల్ ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 100 రోజుల విరామం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అధికారుల బృందం అవిశ్రాంతంగా శ్రమించి మంచి పోర్టల్ ను ప్రారంభించారని సోమవారం నుంచే రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభమయ్యిందన్నారు. ప్రజలకు రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు అత్యంతవేగంగా, సులువుగా రిజిస్ట్రేషన్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సేల్ డీడ్‌లపై ఉన్న అపోహలను తొలగిస్తాం…
అన్ని వర్గాల వారి నుంచి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ప్రజలకు సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్‌లు జరగాలని ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని, ఈ సబ్ కమిటీలో తనతో పాటు మంత్రులు కెటి రామారావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఉన్నారన్నారు. ఈ సబ్ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అధికారులతో సమావేశమై ప్రజలు, బ్యాంకర్లు, కొనుగోలు దారులు, అమ్మకం దారులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను ఇచ్చామన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్‌ల బ్యాక్ లాగ్ లను పూర్తి చేయడానికి పని ఆధారంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాలలో అదనపు ఉద్యోగులను నియమించి మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సేల్ డీడ్‌లపై ఉన్న అపోహలను త్వరలోనే తొలగిస్తామన్నారు. కొనుగోలు దారులు, అమ్మకం దారులు తమకు సంబంధించిన సొంత డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌లో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చన్నారు. స్టేక్ హోల్డర్లతో ఈ నెల 17 తేదీన ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో వర్క్‌షాపు నిర్వహిస్తామన్నారు.

GPA, DGPA, SPAలను రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తాం…

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, చిన్న చిన్న అవరోధాలు అధిగమిస్తూ ముందుకు పోతున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అందరి సూచనలు, సలహాలు తీసుకొని అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. GPA, DGPA, SPA ప్రొవిజన్లను రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. స్టాటుటరీ, ఆపరేషనల్ సిస్టం, సాంకేతిక సమస్యలపై అధికారులతో మూడు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1.చట్ట పరమైన ఇబ్బందులకు ఒక బృందం, 2.సాంకేతిక సమస్యలపై మరో బృందం, 3.క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణకు మరో బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మూడు బృందాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు భాగస్వాములై తగిన సలహాలు, సూచనలు ఇస్తారని మంత్రి తెలిపారు. 100 రోజులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రులు అందులో పాలు పంచుకొని వర్కింగ్ గ్రూపులుగా ముందుకు వెళుతున్నామన్నారు.అంతకుముందు జరిగిన సబ్ కమిటీ భేటీలో మంత్రులు కెటి రామారావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సుమారు మూడు గంటల పాటు అధికారులతో, రియల్టర్లు, బిల్డర్లతో సమావేశమై పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సమావేశంలో క్రెడాయ్ చైర్మన్ గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి. రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ నుంచి అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, నర్సింహారావు తదితరులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News