Friday, May 10, 2024

బండీ సోయుందా?

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ గురించి మాట్లాడేముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకో
కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగబద్ధమైనవి, వాటిని ప్రశ్నించే ముందు
రాజ్యాంగ సూత్రాలను గమనించాలి ప్రధాని మోడీని సిఎం కెసిఆర్
కొత్తగా ఇప్పుడే కలవలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక సార్లు
ప్రధానితో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన
నిధులు, బకాయిలు, ప్రాజెక్టులకు కేంద్ర హోదా, కొత్త విమానాశ్రయాలు
మున్నగు అనేక విషయాలు ప్రధానితో కేంద్రమంత్రులతో కెసిఆర్
చర్చించారు ఎందుకు కలిశావ్, ఏం మాట్లాడావ్ అని బండి అడగడం
సమంజసం కాదు : మీడియాతో ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఎ బాల్క సుమన్

నీలాగ మేమూ మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నీలా మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డు వస్తుందని ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఎ బాల్కసుమన్ హెచ్చరించారు. సిఎం కెసిఆర్ గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఎంటో గుర్తుతెచ్చుకుని మాట్లాడాలని బండి సంజయ్‌ని బాల్కసుమన్ మందలించారు. రాజ్యాంగబద్దమైన కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రశ్నించే ముందు రాజ్యాంగ సూత్రాలను గమనించాలని చెప్పారు. మంగళవవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వవిప్, ఎంఎల్‌ఎ బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర  ప్రయోజనాలకోసం రాజ్యాంగ బద్దంగా దేశ ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ కలవపట్ల బిజెపి నాయకుడు బండి సంజయ్ విమర్శించడాన్ని బాల్కసుమన్ తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమనేతగా,కేంద్ర మంత్రిగా, ఎంఎల్‌ఎ, ఎంపి, డిప్యూటీస్పీకర్‌గా అనేక హోదాల్లో పనిచేసిన సిఎం కెసిఆర్‌ను విమర్శించే ముందు బండి సంజయ్ నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ కొత్తగా కలవలేదు, తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రయోజకోసం అనేకపర్యాయాలు ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులను సిఎం కెసిఆర్ కలిశారని ఆయన గుర్తు చేశారు. ప్రధానిని ఎందుకు కలిశావు, సమావేశంలో చర్చించిన విషయాలు వెల్లడించాలని సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించే స్థాయి బండి సంజయ్‌కి ఉందాని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రానికి కేంద్ర నుంచి రావల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా,నూతన విమానాశ్రయాల ఏర్పాటు అంశాలపై ప్రధానితో పాటుగా కేంద్రమంత్రులతో సిఎం కెసిఆర్ చర్చించారని బాల్కసుమన్ చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగపరమైన, అభివృద్ధి పరమైన అనేక అంశాలుంటాయని బండిసంజయ్‌కి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయాలు తెలియకుండా ప్రధానిమోడీని ఎందుకు కలిశావు, ఎం మాట్లాడావు అవుంటూ బిజెపినాయకుడు బండి మాట్లాడటం సరిగ్గాలేదన్నారు. స్థాయిలేని బండిసంజయ్ మాటలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్‌ని ప్రజలే పట్టించుకోవడంలేదు మేము ఎందుకు పట్టించుకోవాలన్నారు. బండి మాదిరిగా మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. టిఆర్‌ఎస్ నాయకుల గురించి మాట్లాడే ముందు అవగాహన పెంచుకుని మాట్లాడాలని బాల్కసుమన్ బిజెపి నాయకులకు చెప్పారు. కొత్తబిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బండి సంజయ్ ఎగిరెగి పడుతున్నారన్నారు. అర్థరహితంగా మాట్లాడుతున్నారన్నారని ఆయన చెప్పారు. రాజ్యాంగబద్దమైన సంస్థలపై, కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై అవగాహన పెంచుకుని బండిసంజయ్ మాట్లాడాలని బాల్కసుమన్ హితవు చెప్పారు. ఇక నుంచి ఆయిన బండి సోయిఉండి మాట్లాడాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News