Friday, April 26, 2024

ఈ సింగిల్ చిన్నోడే…

- Advertisement -
- Advertisement -

Release of Ee single Chinnode song from Pagal movie

 

విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పాగల్’. బుధవారం ఈ చిత్రం నుండి ‘ఈ సింగిల్ చిన్నోడే…’ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. హీరో ప్రతిసారి వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం…అతను ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట ఇదని తెలిసింది. ఈ పాటలో సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో విశ్వక్‌సేన్ కనిపిస్తాడు. ఈ పెప్పీ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ స్వరపరచగా బెన్నీ దయాల్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఆలపించాడు. కృష్ణ కాంత్ సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News